నిజామాబాద్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆద్వర్యంలో నిర్వహించనున్న యువచైతన్య స్పూర్తి ర్యాలీ గోడప్రతులను జిల్లా పరిషత్ చైర్మెన్ దాదన్నగారి విఠల్ రావు మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. దివంగత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం వర్దంతిని పురస్కరించుకొని ఈ నెల 27న నిజామాబాదుతో పాటు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లా కేంద్రాలలో ర్యాలీ జరుగుతుందని వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం చెప్పారు.
అబ్దుల్ కలాం 83 సంవత్సరాలు జీవించారని, ఆయన సేవలకు నివాళిగా 27వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో 83 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మెన్ దాదన్నగారి విఠల్ రావు మాట్లాడుతూ దేశ సమగ్రాభివద్దిని కాంక్షిస్తూ దేశభక్తి చాటుతూ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఇలాంటి ర్యాలీలు ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
27న జరిగే ర్యాలిలో విద్యార్థులు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ప్రతినిధులు యెద్దండి మచ్చేందర్, తక్కూరి హన్మాండ్లు, తిరునగరి శ్రీహరి, చింతల గంగాదాస్, ఇందూరి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం - December 14, 2019
- మతపరంగా పౌరసత్వం ఇవ్వడం ప్రమాదకరం - December 14, 2019
- సహజ వనరులు పొదుపుగా వాడుకోవాలి - December 14, 2019