Breaking News

బీడీ కార్మికుల ధర్నా

కామారెడ్డి, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో బీడీ కార్మికులకు రూ. 2016ల జీవన భతి ఇస్తామని నేటికి ఇవ్వనందున బుధవారం తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యునియన్‌, సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆద్వర్యంలో మాచారెడ్డిలో ర్యాలి, తహసీల్దారు కార్యాలయం ముందు దర్నా చేసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యునియన్‌ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు హాజరై మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఎన్నికలలో బీడీ కార్మికులకు రూ.2016 జీవన భతి ఇస్తామని ఓట్లు వెయించుకొని మరిసిపోయింది. బీడీ కార్మికుల ఓట్లతో గద్దె ఎక్కిన తెరాస సర్కారు, ఎన్నికలు అయిపొయి ఆరునెలలు గడుస్తున్నా నేటికి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రూ. 2016 లు ఎలాంటి షరతు లేకుండా బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, నెలసరి ఉద్యోగులకు, టెకెదార్లు ఇవ్వాలని లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి, కమ్మరి సదనందం, జిల్లా నాయకులు బాల్‌రాజు, శ్రీనివాస్‌, లక్ష్మీ, లావణ్య, రాజమణి, శీరిష, జయలక్ష్మి, స్వాతి, రాజేశ్వరి, లలిత, తదితరులు పాల్గొన్నారు.

Check Also

25న ఆదిభట్ల నారాయణదాసు జయంతి

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *