Breaking News

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు విస్థారకుల కార్యశాల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్‌ భవనంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్‌, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో 40వేల సభ్యత్వం పూర్తి చేయాలని దానికి సంబంధించిన మండల, గ్రామ, బూత్‌ స్థాయి ఇంచార్జిలను నియమించి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలన్నారు.

తెలంగాణలో యువత స్వచ్చందంగా బీజేపీలో సభ్యత్వం తీసుకుంటున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీలో యువత నాయకత్వ బాధ్యత తీసుకుంటారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల సభ్యత్వ పూర్తి చేసే వరకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలన్నారు. 19 శాతం ఉన్న బీజేపీ ఓటు బ్యాంకును 50 శాతం తీసుకుపోవటానికి పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పథకాల ద్వారా తెలంగాణకి నిధులు ఇస్తుందని, వాటిని కార్యకర్తలు బూత్‌ స్థాయిలో ప్రజలకు తెలియజేసేలా పని చేయాలన్నారు.

Check Also

31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *