Breaking News

ఫోన్‌ ఇన్‌ ద్వారా ప్రజలు సమస్యలు పరిష్కరించుకోవాలి

కామారెడ్డి, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలు ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో భూ సమస్యలపై ఫిర్యాదు చేసిన వారితో ఆయన నేరుగా మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భూ సమస్యలకు సంబంధించి ప్రజలు కలెక్టర్‌తో మాట్లాడారు.

ఫోన్‌లో సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత తహసీల్దార్లు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, కలెక్టరేట్‌ తహసీల్దార్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

25న ఆదిభట్ల నారాయణదాసు జయంతి

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *