Breaking News

22న కలెక్టరేట్‌ ముట్టడి

కామారెడ్డి, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుదవారం కామారెడ్డి జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ హాజరై మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న కరువు, తాగునీటి సమస్య, భూ సమస్య, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని జులై 22న కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని అన్నారు.

అదేవిదంగా రైతులకు పాస్‌ పుస్తకాలు, చెక్కులు రాక అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె అన్నారు. అంతే కాకుండా భూప్రక్షాళన పేరుతో రైతులను అధికారులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు పథకం కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. అదే విదంగా ప్రభుత్వం 4 వేల పాఠశాలలు మూసివేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. సచివాలయంలో కూల్చి వేయడం ఎంత వరకు కరెక్ట్‌ అని అదే 500 కోట్ల రూపాయలతో రాష్టంలో గురుకులాల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించవచ్చని ఆమె అన్నారు.

ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు డబ్బును ఖర్చు చేయాలని ప్రజా ధనాన్ని వధా చేయరాదని హితవు పలికారు. అలాగే వరవరరావు, ప్రో సాయిబాబా లాంటి వారిని అర్బన్‌ నక్సలైట్‌ పేరుతో జైల్లో పెట్టడం అన్యాయమన్నారు. ప్రశ్నించే వారిని ప్రభుత్వం అణచివేయాలని చూడటం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే పొరాటాలు తప్పవని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు దుబ్బాస్‌ రాములు, ఎల్‌.దశరథ్‌, సుధాకర్‌, రాజమని, రాజగౌడ్‌, గంగాధర్‌, గణేష్‌, నరేష్‌, ప్రశాంత్‌ ఉన్నారు.

Check Also

గర్భిణికి రక్తదానం చేసిన ఏబివిపి కార్యకర్త

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన మంజుల ఎనిమిది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *