Breaking News

ఎస్సైగా ఎంపికైన యువకుడిని సన్మానించిన తహసీల్దార్‌

రెంజల్‌, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కళ్యాపూర్‌ గ్రామానికి చెందిన అమాంద్‌ అరవింద్‌ అనే యువకుడు ఎస్సైగా ఎంపికవ్వడంతో తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని యువకులు అందరూ అరవింద్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అతి చిన్న వయస్సులోనే ఎస్సైగా ఎంపికవ్వడం అభినదనియమని మన మండలానికి చెందిన యువకుడు ఎస్సైగా ఎంపికవ్వడం ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ గంగా సాగర్‌, రైతు సమన్వయసమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు రాజు, సాయరెడ్డి, వికార్‌ పాషా, రమేష్‌, సాయిలు, ఉప సర్పంచ్‌ జలయ్య, నాయకులు నర్సయ్య, బాబు నాయక్‌, రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహిళా సమాఖ్య నూతన పాలకవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఆర్మూర్‌ మండల మహిళా సమాఖ్య 12వ వార్షిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *