Breaking News

పెద్దగుజ్జుల్‌ తాండాలో ఆరోగ్య శిబిరం

కామారెడ్డి, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పెద్ద గుజ్జుల్‌ తాండాలో ప్రజలు అనారోగ్య సమస్యతో బాధపడుతుండడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశానుసారం గురువారం డాక్టర్‌ శోభారాణి నేతృత్వంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ హరిప్రసాద్‌, పారామెడికల్‌ సిబ్బంది తాండాలోని ప్రతి ఇంటిని సందర్శించి అక్కడి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు.

124 మందికి చికిత్సలు చేశారు. ఇందులో ఐదుగురు మూత్రపిండ వ్యాధులు, ఇద్దరు క్యాన్సర్‌, నలుగురు కిడ్నిలో రాళ్ళ సమస్యలతో ఉన్నట్టు గుర్తించారు. వారికి చికిత్స అందించనున్నట్టు తెలిపారు. పలు రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపినట్టు వివరించారు. శిబిరంలో వైద్యులు శోభారాణి, కరుణశ్రీ, సిబ్బంది సంజీవరెడ్డి, దస్తారాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *