Breaking News

గ్రామ సమస్యలు పరిష్కరించండి

కామారెడ్డి, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగాపూర్‌ గ్రామ తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య పరిస్కారం గురించి కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత వారం రోజులుగా గ్రామములో ఒక్క నీటి చుక్క కూడా రాలేదని, వారం రోజుల నుండి మున్సిపల్‌ అధీకారులను సంప్రదించినా తాత్కాలిక పరిష్కారం కూడా చూపలేదని, బోరు కిరాయి తీసుకున్న యజమానికి 3 నెలల నుండి బిల్లు చెల్లించలేదని, మోటరు కాలిపోతే రిపేర్‌లకు కూడా డబ్బులు ఇవ్వక పోవడంతో నీటి సమస్య ఎదురైందని, మిషన్‌ భగీరథ నీరు పత్తా లేదని వాపోయారు.

లింగాపూర్‌ మున్సిపల్‌లో విలీనం అయినప్పటి నుండి చెత్తను, మోరీలను తీసిన పాపాన పోలేదని, ఎటు చూసినా చెత్తమయమే అయ్యిందని అన్నారు. లింగపూర్‌ గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులను, వాటర్‌మెన్‌లను కామారెడ్డిలో విధులకు వాడుకుంటున్నారని అన్నారు. ఒక్క వీధి దీపం కూడా వెలగటం లేదని అన్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్యలు తలెత్తాయని గత వారం రోజులుగా మున్సిపల్‌ చుట్టూ తిరుగుతున్నా ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేరని మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Check Also

మహిళా సమాఖ్య నూతన పాలకవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఆర్మూర్‌ మండల మహిళా సమాఖ్య 12వ వార్షిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *