పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధించాలి

నిజామాబాద్‌, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, విశ్వతేజస్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ సంస్థ వ్యవస్థాపకులు తిరునగరి శ్రీహరి ఉద్బోదించారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం నిజామాబాదు జిల్లా కేంద్రంలోని బిసి సంక్షేమ వసతి గహంలో వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రణాళికా బద్దంగా పాఠ్యాంశాలను ఇష్టపడి చదివితే చదువులో రాణిస్తారన్నారు.

పట్టుదలతో కషి చేసి లక్ష్యాలు సాధించాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని దానిని వెలికితీయాలన్నారు. పరీక్షలంటే ఉన్న భయాన్ని వీడాలని పాజిటివ్‌ దక్పథంతో ముందుకు సాగాలని అన్నారు. లయన్స్‌ క్లబ్‌ అద్యక్ష, కార్యదర్శులు లక్ష్మినారాయణ భరద్వాజ్‌, చింతల గంగాదాస్‌, కోశాధికారి సిలివేరి గణేష్‌, బిసి సంక్షేమ వసతి గహం అధికారి మచ్చేందర్‌, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌ డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 60 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *