ఇందూరులో ‘హెల్ప్‌ టు అదర్స్‌’ సేవా కార్యక్రమాలు

నిజామాబాదన జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమెరికాకు చెందిన హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ నిజామాబాదు జిల్లాలో సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా శుక్రవారం సంస్థ డైరెక్టర్‌ జిలకర స్వప్న నిజామాబాదు నగరానికి చెందిన ముగ్గురు పేద మహిళలకు నెహ్రూ యువ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉచితంగా కుట్టుమిషిన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రగతినగర్‌లోని ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రంలో కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలకు శిక్షణ ఫీజుతో పాటు మిషన్ల కోసం 35 వేల రూపాయల చెక్కు అందజేశారు. కుట్టు మిషన్‌ అందుకున్న ఓ మహిళ తన భర్త క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని చెప్పగా వైద్యం కోసం ఆర్థిక సహాయం అందజేస్తామని స్వప్న హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ డైరెక్టర్‌ జిలకర స్వప్న మాట్లాడుతూ పేదలకు సేవ చేసేందుకు మూడు సంవత్సరాల క్రితం అమెరికాలోని వివిద సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్న ఆరుగురం కలిసి శ్రీలత కొరడా నాయకత్వంలో హెల్ప్‌ టు అదర్స్‌ ప్రారంబించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు అమెరికాతో పాటు భారతదేశంలోని పంజాబ్‌, ఆంద్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో తమ సంస్థ ఆద్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

సేంద్రియ పద్దతులలో వ్యవసాయం చేస్తున్న వారికి శ్రీకాకుళంలో ఉచితంగా ఆవులు అందజేశామని, పంజాబ్‌తో పాటు వరంగల్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. నిజామాబాదు జిల్లాలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ సభ్యులు జె.లావణ్య విజయానంద్‌, చింతల గంగాదాస్‌, డాక్టర్‌ జమాల్‌ పూర్‌ రాజశేఖర్‌, ప్రదాన మంత్రి కౌషల్‌ కేంద్ర ప్రిన్సిపాల్‌ గుర్రం వాసుదేవరెడ్డి, శిక్షకురాలు జి.లావణ్య, నెహ్రూ యువ కేంద్రం ప్రాజెక్టు ఆఫీసర్‌ తులసిధర్‌, అకౌంటెంట్‌ రేష్మ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌ డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 60 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *