Breaking News

23న ధర్నా

ఆర్మూర్‌, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆరేళ్ల పాలనలో ఉద్యోగ కార్మికులకు అన్యాయం జరిగిందని ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ విధానం రద్దు చేసి ఉద్యోగ కార్మికులందరినీ క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంలో, ఎన్నికల్లో మాట ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం విచారకరమని దాసు అన్నారు.

రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాలుగా వివిధ రంగాలకు చెందిన డెబ్బై జీవోలను సవరించి, ఉద్యోగ కార్మికుల వేతనాలు పెంచి జీవన ప్రమాణాలు మెరుగు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన అన్నారు. జీవోలను సవరించాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర కమిటీ ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ లేదా జిల్లా లేబర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చిందని అందులో భాగంగానే నిజామాబాద్‌ కేంద్రంలో లేబర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని దాసు కోరారు.

జక్రాన్‌పల్లిలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు సూర్య శివాజీ మరియు తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జక్రాన్‌పల్లి మండల అధ్యక్షులు, నాయకులు భానుచందర్‌, గంగాధర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, బాలరాజ్‌, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *