Breaking News

ఇసుక డంపులపై పోలీసుల దాడులు

జగిత్యాల, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ధర్మపురి ఎస్‌.ఐ శ్రీకాంత్‌ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి ధర్మపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజారాం, జైన గ్రామంలో గల 70 ఇసుక డంప్‌ల పై దాడులు నిర్వహించారు.

ఇందులో సుమారు 2100 ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేయడం జరిగింది. సీజ్‌ చేసిన ఇసుకను సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయానికి అప్పగించడం జరిగింది. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, అక్రమంగా నిలువ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Check Also

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ యాక్షన్‌ తయారు ...

Comment on the article