బస్‌పాస్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలి

నిజాంసాగర్‌, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌లో చదువుకుంటున్న పాఠశాల, ఇంటర్మీడియట్‌, డిగ్రీ విద్యార్థుల కోసం బస్‌పాస్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ఏబివిపి విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ డిపో మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించారు. వివిధ గ్రామాల బస్సు సమస్యలను వెంటనే పరిస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

గత సంవత్సరం ఇదే సమయానికి బస్సుపాస్‌ కౌంటర్‌ అందుబాటులో ఉండేదని విద్యాసంస్థలు ప్రారంభమై నెలరోజులు పూర్తవుతున్నా ఇంతవరకు కౌంటర్‌ ఏర్పాటు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఏబివిపి విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *