Breaking News

ఇచ్చినమాట నిలబెట్టుకున్న సిఎం

రెంజల్‌, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవెచ్చి రూ. వేయి రూపాయలు ఉన్న పింఛన్‌ రూ.2016 పెంచి అభాగ్యులకు అండగా నిలిచారని జడ్పీటీసీ మేక విజయ అన్నారు. బుధవారం మండలంలోని బొర్గం, తాడ్‌బిలోలి గ్రామాల్లో ఆసరా పింఛన్లను సర్పంచ్‌లు వాణి, సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన పింఛన్లతో వద్దులకు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళల జీవితంలో ఆనందాన్ని నింపారన్నారు.

కార్యక్రమంలో ఎంపీటీసీ లు రుక్మిణీ, లక్ష్మీ, ఉపసర్పంచ్‌ లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి అమ్రీన్‌, విండో చైర్మన్‌ మోహినోద్దీన్‌, బీపీఎం ప్రసన్నకుమార్‌, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, మాజీ ఎంపిటిసి నర్సయ్య, దత్తుపటేల్‌, రవీందర్‌ గౌడ్‌, సాయరెడ్డి, అబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

గర్భిణికి రక్తదానం చేసిన ఏబివిపి కార్యకర్త

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన మంజుల ఎనిమిది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *