Breaking News

Daily Archives: July 28, 2019

కామారెడ్డిలో బోనాలు

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని విద్యుత్‌ నగర్‌ కాలనీలో ఆదివారం బోనాల పండగ వైభవంగా నిర్వహించారు. మాజీ వార్డు మెంబర్లు నాగరాజు, రియాజ్‌, రాజగౌడ్‌, సంతోష్‌, కిరణ్‌, మైశాగౌడ్‌, మునీర్‌, రాకేశ్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు పండగలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తినెత్తుకొని అమ్మవారికి సమర్పించారు.

Read More »

యోగాతో వ్యక్తిత్వ వికాసం

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి కాలమాన పరిస్థితులలో యోగ పాటించి ఒత్తిడిని దూరం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక గంజిలోని రామాలయంలో పతంజలి యోగ సమితి వారి 9వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యోగా ద్వారా శరీరము, బుద్ధి, ఆత్మ ఏకాగ్రతతో ఆధీనంలో ఉంటాయని, ఎన్ని ఇబ్బందులున్నా మనోధైర్యంతో అధిగమించవచ్చని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చునని అన్నారు. వ్యక్తి వికాసానికి యోగా చాలా అవసరమని ...

Read More »

క్యాసంపల్లి లో హరితహారం

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాసంపల్లి గ్రామంలో ఆదివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 2016 రూపాయల పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి ఆంజనేయులు, వైస్‌ ఎంపిపి ఉరుదొండ నరేశ్‌, జడ్పిటిసి చిదుర రమాదేవి, లక్ష్మారెడ్డి, ఎంపిటిసి భాగ్యలక్ష్మిరాజు, సర్పంచ్‌ సందిరి మంజుల నారాయణరెడ్డి, ఉపసర్పంచ్‌ బాలకిషన్‌గౌడ్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేగాం గ్రామపంచాయతీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మంజూరైన గ్యాస్‌ సిలిండర్లు ఆదివారం పంపిణీ చేశారు. అందులో భాగంగా హెచ్‌.పీ గ్యాస్‌ ఆర్మూర్‌ నరేందర్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఆర్మూర్‌ మండలంలోనే అత్యధికంగా దేగాం గ్రామంలో సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మాజీ సర్పంచ్‌ బియ్యంక్‌ గణేష్‌ సహకారంతో ఆర్మూర్‌ మండలంలోనే అత్యధిక దరఖాస్తులు స్వీకరించి తమకు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆదివారం కొన్ని సిలిండర్లు ...

Read More »

భవన నిర్మాణాలకు భూమిపూజ

బాన్సువాడ, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ భవనం, డ్వాక్రా మహిళా సంఘ భవనాలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం భూమిపూజ చేశారు. రూ. 30 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనం, రూ. 5 లక్షలతో నిర్మించే డ్వాక్రా మహిళ సంఘం భవనాలకు సభాపతి భూమి పూజ చేసి పనులు ప్రారంభింపజేశారు. భవన నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలని, వీలైనంత త్వరలో పూర్తిచేయాలని గుత్తేదారుకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామ ...

Read More »

11న ఎన్నికలు

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని బాపూజీ వాచనాలయ కార్యవర్గ ఎన్నికలు ఆగష్టు 11న నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు శ్రీహరి ఆచార్య, జగన్‌మోహన్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ళకోసారి జరిగే ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులతో పాటు తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఆగష్టు 2,3 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 4న పరిశీలన, 5న ఉపసంహరణ చేసుకోవాలని సూచించారు. ఆగష్టు 11న ఉదయం 9 గంటల నుంచి ...

Read More »

పోలీసులకు ఫిర్యాదు

రెంజల్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ అంతర్జాలంలో అసభ్యకర ఫోటోలు పెట్టిన రెంజల్‌ మండలానికి చెందిన ఇంజమామ్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని రెంజల్‌ మండల బిజెపి అధ్యక్షుడు మేక సంతోష్‌ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో కలిసికట్టుగా ఉన్న హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చ గొడుతూ దేశ ప్రధానమంత్రిని అవమానపరుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిదంగా అంతర్జాలంలో అసభ్యకరంగా ఫొటోలు పెడుతూ ఇరు ...

Read More »

జైపాల్‌రెడ్డి భౌతిక కాయానికి సురేశ్‌రెడ్డి నివాళి

హైదరాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూబ్లీహిల్స్‌లో జైపాల్‌ రెడ్డి భౌతిక కాయానికి మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకుడిగా జైపాల్‌ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని, జైపాల్‌ రెడ్డి వాయిస్‌ ఎప్పుడు ప్రజా సమస్యల పక్షాన్నే ఉండేదని సురేశ్‌రెడ్డి గుర్తుచేశారు. నేటి యువతరానికి ఆయన ఎంతో ఆదర్శప్రాయమని, గొప్ప అభ్యున్నత భావాలు కలిగిన వ్యక్తి జైపాల్‌రెడ్డి అని అన్నారు. నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి జైపాల్‌ ...

Read More »