Breaking News

పోలీసులకు ఫిర్యాదు

రెంజల్‌, జూలై 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ అంతర్జాలంలో అసభ్యకర ఫోటోలు పెట్టిన రెంజల్‌ మండలానికి చెందిన ఇంజమామ్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని రెంజల్‌ మండల బిజెపి అధ్యక్షుడు మేక సంతోష్‌ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో కలిసికట్టుగా ఉన్న హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చ గొడుతూ దేశ ప్రధానమంత్రిని అవమానపరుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిదంగా అంతర్జాలంలో అసభ్యకరంగా ఫొటోలు పెడుతూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సష్టించేందుకు పాల్పడుతున్న ఇటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లోలపు కిషోర్‌, భాజపా నాయకులు ఉన్నారు.

Check Also

25న ఆదిభట్ల నారాయణదాసు జయంతి

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *