Breaking News

నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం

నిజామాబాద్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి యువతకు అవకాశం కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. యువతను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతను ప్రోత్సహించడానికి ఆవిష్కరణలతో ముందు వచ్చే వారికి వారి సజనాత్మకతను, ఇన్నోవేషన్‌ వెలికి తీయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్‌ సెల్‌ను ప్రారంభించిందని కలెక్టర్‌ తెలిపారు.

కొత్తగా ఆవిష్కరణలను కనుగొనే వారికి పౌరులు ఆవిష్కర్తల మధ్య అనుసంధానం కావడానికి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తేవడం జరిగిందని ఆయన తెలిపారు.

అన్ని రంగాలు, వర్గాల ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి గ్రామీణ విద్యార్థినీ విద్యార్థుల, ప్రారంభ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నామని తెలిపారు. ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణకు సంబంధించి వీడియోలను వాటి వివరాలను ఆగస్టు 5వ తేదీలోగా 9100678543 వాట్సాప్‌ నంబర్‌కు పంపించాలని, అట్టి దరఖాస్తులను షార్ట్‌ లిస్ట్‌ చేసి ఆగస్టు 15వ తేదీన ఉత్సవాలలో ప్రదర్శించుటకు అవకాశముందని కలెక్టర్‌ ప్రకటనలో తెలిపారు.

ఉత్సాహవంతులైన ఇన్నోవేటర్లు అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ప్రతిభను, సజనాత్మకతను వెలుగులోకి తీసుకు రావాలని ఆయన సూచించారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *