Breaking News

కస్తూర్బా పాఠశాల తనిఖీ

రెంజల్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ప్రార్ధన సమయనికి పాఠశాలకు చేరుకుని ప్రార్థన గీతంలో పాల్గొన్నారు.

అనంతరం పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరుశాతం, టీచర్‌ డైరీలను పరిశీలించిన ఆయన ఉపాధ్యాయులు ప్రార్థన సమయానికి హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో కస్తూరిబా ప్రత్యేకాధికారి మమత, ఉపాధ్యాయురాలు ఉన్నారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *