Breaking News

ప్రసాద్‌ సేవలు మరువలేనివి

నిజామాబాద్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పౌర సరఫరా అధికారిగా పనిచేస్తూ పిఎల్‌ వి.వి ప్రసాద్‌ సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అతి చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగం పొంది అంచలంచలుగా ఎదుగుతూ 35 సంవత్సరాల పాటు పని చేయడం గొప్ప విషయమని అన్నారు.

ఆయన సేవలు జిల్లాలో అందరి మన్ననలు పొంది చిరస్థాయిగా నిలిచిపోయాడన్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్లో ధాన్యం సేకరణలో జిల్లా రాష్ట్రంలో కంటే ముందస్తులో ఉందని దానికి ఆయన కషి ఎంతో ఉందన్నారు. ఆయన పదవి విరమణ పొందిన తర్వాత సంఘ సేవ చేసేందుకు కషి చేయాలని చెప్పారు. కష్ణ ప్రసాద్‌ సంబంధించిన తండ్రి, కుమారుడు మూడు తరాలకు చెందిన సన్మాన కార్యక్రమాలు పాల్గొనడం గొప్ప విషయమని అన్నారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండి శాఖాపరమైన సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండి సేవలందించిన వ్యక్తి అని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య మాట్లాడుతూ కష్ణ ప్రసాద్‌ ఎక్కడ చేసిన అంకిత భావంతో పని చేసినట్లు వారి స్నేహితులు తెలియజేశారని, జిల్లాలో కూడా అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందడం గొప్ప విషయమని అన్నారు.

ఈ సందర్భంగా పదవివిరమణ పొందుతున్న కష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ ఉద్యోగ పర్వంలో బదిలీలు, పదవి విరమణలు సహజమే అయినప్పటికీ ఉద్యోగం చేసే సందర్భంలో కుటుంబ బాధ్యతలను సరిగా చూసుకోలేదని బాధ పడ్డారు. దానికి తమ శ్రీమతి సుధారాణి తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినందున ఉద్యోగపర్వం సమర్థవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, జెసి, డిఆర్‌ఓ, రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ కన్స్యూమర్‌ ఫోరం అధ్యక్షులు రాజేశ్వర్‌, ఆయా శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు.

Check Also

ప్రతి ఫోటో ఒక మధురానుభూతియే…

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఫోటో వెనుక ఒక అనుభూతి ఒక జ్ఞాపకం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *