Breaking News

ఓటరు పరిశీలన సమర్థవంతంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 16 నుండి సెప్టెంబర్‌ 30 వరకు చేపట్టే ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను కోరారు. బుధవారం మధ్యాహ్నం ఫోటో ఓటర్‌ జాబితా స్పెషల్‌ సమ్మరి రివిజన్‌పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం జనవరి 1, 2020 అర్హత తేదీగా స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ ప్రకటించినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఆగస్టు 1 నుండి 15 వరకు అవగాహన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలన చేసుకోవాలని (చెక్‌ యువర్‌ ఓట్‌) అన్నారు. ఆగస్టు 15 నుండి సెప్టెంబర్‌ 30 వరకు ఏలక్టర్స్‌ వెరిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ క్యాంపెయిన్‌ మోడ్‌లో చేపట్టాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కు ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ ద్వారా మొబైల్‌ యాప్‌ ఎన్‌విఎస్‌పి పోర్టల్‌ మీ సేవ కేంద్రాలు బిఎల్‌వో, ఈఆర్‌ఓ వద్దకు వెళ్లి పరిశీలన చేసుకోవాలని చెప్పారు.

ఓటర్‌ జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకోవడం, మరణించిన, షిఫ్ట్‌ అయిన ఓటర్లను తొలగించడం, ఓటర్‌ జాబితాలో ఫోటో నాణ్యతను పరిశీలించడం లాజిక్‌ ఎర్రర్స్‌ డెమో గ్రాఫికల్లి సిమిలర్‌ ఎర్రర్స్‌ తొలగించి స్పష్టమైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. సెప్టెంబర్‌ 1 నుండి 30వ తేదీ వరకు బూత్‌లెవల్‌ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలన చేయాలని, పరిశీలనలో భాగంగా ఓటరు జాబితాలో నమోదు కాని వివరాలు మరణించిన షిఫ్ట్‌ అయిన వారి పేర్ల సమాచార వివరాలను సేకరించాలన్నారు.

ఆ తర్వాత సమగ్ర ఓటరు జాబితాను అక్టోబర్‌ 15 వ తేదీన ప్రచురించాలని ఓటరు జాబితా పై వచ్చిన పిర్యాదులు, అభ్యంతరాలు అక్టోబర్‌ 15 వ తేదీ నుండి నవంబర్‌ 30 తేదివరకు స్వీకరించి డిసెంబర్‌ 15 నాటికి పరిష్కరించాలని చెప్పారు. ఓటరు జాబితాపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఉండాలని అందుకు బూత్‌ స్థాయి అధికారుల పాత్ర కీలకమైనది చెప్పారు.

అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపినందుకు అందరికీ అభినందలు తెలియజేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ నియోజకవర్గ ఈఅర్‌ఓ లతో మాట్లాడుతూ జిల్లాలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ పట్టణ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ద పెట్టీ ఓటరు జాబితాను తప్పులు లేకుండా పరిశీలన చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఓటరు జాబితాలో వయస్సు, స్టాండర్డ్‌గా ఫోటో లేక పోవడం, మిస్సింగ్‌, మరణం, షిఫ్టింగ్‌ సమాచారాన్ని సేకరించి ఓటరు జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఆగస్టు 15 నుండి సెప్టెంబర్‌ 30 తేదీ వరకు సమయముందని చెప్పారు. గత ఎన్నికల సమయంలో పిర్యాదులు వచ్చినందున నియోజక వర్గ ఈఅర్‌ఓలు ఓటరు జాబితా స్పష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఓటరు జాబితాను రేషనలైజేశన్‌ సెక్షన్‌ కొరకు సాంకేతికతను వినియోగించుకొని నాజారి నక్షా తయారు చేయాలని సాంకేతిక పరిజ్ఞానం గల బూత్‌ స్థాయి అధికారులు ఎందరున్నారో గుర్తించి అవసరమైతే శిక్షణ కల్పించి మంచి సామర్థ్యం ఉండేలా తీర్చి దిద్దడం అవసరమైతే కొత్త వారిని నియమించి పూర్తి చేయాలని ఈఅర్‌ఓలను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అర్‌.అంజయ్య, జడ్పీ సీఈఓ గోవిందు, డిఅర్‌డిఓ రాథోడ్‌ రమేష్‌, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, గోపీనాథ్‌ ఎలక్షన్‌ సెక్షన్‌ పర్యవేక్షకుడు గఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *