Breaking News

Daily Archives: August 1, 2019

పంటల సాగుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంటలు సాగుచేస్తుండడంతో వ్యవసాయ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మత్స్యశాఖలతో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ 2019లో సంవత్సరానికిగాను లక్ష 20 వేల 895 హెక్టార్లలో రైతులు ఆయా పంటలు సాగుచేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందజేయాలని పేర్కొన్నారు. రైతుబంధు, ...

Read More »

విద్యార్థులు సరైన పోషకాహారం తీసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు సరైన పోషకాహారం తీసుకోవాలని తద్వారా ఆరోగ్యంతో పాటు చదువుపై ఏకాగ్రత ఉంటుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం సీతాయిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిత్య అల్పాహార కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి ట్రస్టు ప్రతినిధి రామ్మూర్తి జిల్లాలో మొదటిసారిగా సీతాయిపేట పాఠశాలలో అల్పాహార వితరణ కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతిరోజు పాఠశాలలో 430 మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వందశాతం హాజరు ...

Read More »

రోడ్లు, మునిసిపల్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్‌ ద్వారా మంజూరైన రోడ్లు, మునిసిపల్‌ పనులను వెంటనే పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బి, పంచాయతీ, మునిసిపల్‌, డిఇ, ఇఇలతో ఏర్పాటైన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జివో 129 అనుసరించి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం కలిపే సింగిల్‌ లైన్‌ను డబుల్‌ లైన్‌గా మార్చడం, జివో 130 అనుసరించి డబుల్‌ లైన్‌ రహదారిగా ...

Read More »

పోలియా దాసరి సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియా దాసరి సంక్షేమ సంఘం దేవునిపల్లి గ్రామ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపోచయ్య, గ్రామ మాజీ అధ్యక్షుడు చిన్న నర్సింలు, శ్రీరాం గంగారాంల ఆద్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నరేందర్‌, ఉపాధ్యక్షునిగా రాజు, కార్యదర్శిగా చిన్న నర్సింలు, కోశాధికారిగా శ్రీనివాస్‌, సలహాదారునిగా మధుకుమార్‌, సహాయ కార్యదర్శిగా సాయికృష్ణ, కార్యనిర్వాహన అధికారిగా శ్రీకాంత్‌, ప్రచార కార్యదర్శిగా రాము, కార్యవర్గ సభ్యులుగా అశోక్‌, మధు, నరేశ్‌, నర్సింలు, గంగాధర్‌, ...

Read More »

రోళ్లగడ్డ బూటకపు ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోళ్లగడ్డ బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులందరిపై హత్యకేసు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేయాలని సిపియుఎస్‌ఐ రాష్ట్ర నాయకులు కట్ల భూమన్న, కమ్యూనిస్టు నాయకులు డిమాండ్‌ చేశారు. సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర నాయకుడు, అజ్ఞాత దళ కమాండర్‌ కామ్రేడ్‌ లింగన్న బూటకపు ఎన్‌కౌంటర్‌ను దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం వారు సాగుచేసుకుంటున్న పోడు భూముల రక్షణ కోసం నిరంతరం శ్రమించి పోరాడిన లింగన్నను ఎన్‌కౌంటర్‌ ...

Read More »

బూటకపు ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి

ఆర్మూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివాసుల హక్కుల పోడు భూముల రక్షణకై పోరాడిన సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్‌ లింగన్న ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ సీపీఐ ఎంఎల్‌ న్యూ డేమోక్రసి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి దళ కమాండర్‌ కామ్రేడ్‌ లింగన్న ఆదివాసీల భూముల కోసం పోరాటం చేస్తే పోలీసులు చుట్టుముట్టి ...

Read More »

బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ధర్నా

రెంజల్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివాసుల హక్కుల పోడు భూముల రక్షణకై పోరాడిన సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్‌ లింగన్న ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ సీపీఐ ఎంఎల్‌ న్యూ డేమోక్రసి రెంజల్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి దళ కమాండర్‌ కామ్రేడ్‌ లింగన్న ఆదివాసీల భూముల కోసం ...

Read More »

రోగులపట్ల ప్రేమ ఆప్యాయతతో మెలగాలి

రెంజల్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్య చికిత్సల కోసం వచ్చిన రోగులను పట్ల ప్రేమ ఆప్యాయత చూపించినప్పుడే రోగి యొక్క వ్యాధి సగం నయమవుతుందని ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌ అన్నారు. రెంజల్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆరోగ్య సలహా కమిటీ మొదటి సమావేశంలో ఆమె మాట్లాడుతూ. సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగుల పట్ల ప్రేమ ఆప్యాయత చూపించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ఏఎన్‌ఎంలు స్థానికంగా ...

Read More »

పుట్టిన బిడ్డకు ముర్రుపాలు అత్యంత క్షేమకరం

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అప్పుడే పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు పట్టించటం ఎంతో శ్రేయస్కరమని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవద్ధుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి వెలిగించి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజల్లో కొన్ని అపోహలు,ఆధునిక పోకడల వల్ల పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు అందించలేకపోతున్నారని ఇది దురదష్టకరమన్నారు. ...

Read More »

యోగసాధన శిబిరం

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యసమాజము ఇందూరు ఆధ్వర్యంలో సత్యార్థప్రకాశ స్వాధ్యాయ, యోగసాధన ఆవాస శివిరము మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్టు ఆర్యసమాజ ప్రతినిదులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిబిరంలో ప్రశిక్షకులుగా ముంబయి నుంచి విచ్చేస్తున్న ఆచార్య అరుణ్‌ కుమార్‌ ఆర్యవీర్‌ వ్యవహరిస్తారన్నారు. మహిళలు పురుషులు పాల్గొని ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలని కోరారు. శిబిరం ఆగష్టు 16,17,18 తేదీలలో స్థానిక ఆర్యసమాజంలో ఉంటుందన్నారు.

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

నందిపేట్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం నూత్‌పల్లి గ్రామంలో గురువారం తెరాస నాయకులు సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో నూత్‌పల్లి గ్రామానికి చెందిన సచిన్‌, అల్లరి రాజన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. అందుకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సచిన్‌కు రూ. 60 వేలు, అల్లరి రాజన్నకు రూ. 35 వేలు అందించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సహకారంతో సిఎం ...

Read More »

ఎక్కడి చెత్త అక్కడే…

నందిపేట్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రారంభమై 50 రోజులు కావస్తుండగా, గడిచిన 7 రోజులుగా భారీ నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రోడ్లపై, డ్రైనేజీల్లోని చెత్త చెదారం ఎక్కడి కక్కడ పేరుకు పోవడంతో దోమలు స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. నందిపేట్‌ మండల కేద్రంలో గత కొన్ని నెలలుగా మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడం వల్ల కాలనీల్లో ముఖ్య రహదారి వెంబడి చెత్త చెదారం ఎక్కడికక్కడే దర్శనమిస్తూ కుళ్లిన వ్యర్థాల ...

Read More »

గోవధ చేస్తే చర్యలు

నందిపేట్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని గోవధ చేస్తే కఠిన చర్యలు తప్పవని నందిపేట ఎస్‌ఐ రాఘవేంద్ర పేర్కొన్నారు. నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్లో ముస్లిం పెద్దలు, కసబ్‌లతో (కటిక వారితో) గురువారం సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. గతంలో జరిగిన దురదష్ట సంఘటనలు దష్ట్యా ఇబ్బందులు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో ముస్లింలు బక్రీద్‌ పండుగ పర్వదినాన్ని సుఖసంతోషాలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల ప్రజలు యువకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఎవరైనా గోవధ చేస్తున్నట్లు ...

Read More »

ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు

రెంజల్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్‌పై అసత్య ఆరోపణలు రాస్తూ ఒక పత్రిక సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తుందని ఇలాంటి అసత్య ఆరోపణలు రాస్తూ సోషల్‌ మీడియా వేదిక ద్వారా ప్రచారం చేస్తే సహించేది లేదని టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, బోధన్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌ అన్నారు. గురువారం రెంజల్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే షకీల్‌ చేస్తున్న అభివద్ధిని ...

Read More »

ఈ ఆటో స్కీంకు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంబిసి కులాలకు ప్రవేశపెట్టిన ఈ ఆటో స్కీమ్‌ను వినియోగించేందుకు ఎంబిసి, అత్యంత వెనుకబడిన బీసీ కులాలు సంచారజాతి కులాలకు చెందిన యువకులు, నిరుద్యోగులు స్కీమ్‌ వినియోగించుకొని స్వయం ఉపాధిని పొందాలని ఎంబీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మఠం విజయ్‌, కార్యదర్శి రాజలింగం, ఉపాధ్యక్షుడు పూసల రమేష్‌, సహాయ కార్యదర్శి వాల్మీకి బోయ శ్యాం కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎంబిసి కులాల ప్రజలు గత సంవత్సరం ...

Read More »