Breaking News

బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ధర్నా

రెంజల్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివాసుల హక్కుల పోడు భూముల రక్షణకై పోరాడిన సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్‌ లింగన్న ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ సీపీఐ ఎంఎల్‌ న్యూ డేమోక్రసి రెంజల్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి దళ కమాండర్‌ కామ్రేడ్‌ లింగన్న ఆదివాసీల భూముల కోసం పోరాటం చేస్తే పోలీసులు చుట్టుముట్టి ఎన్‌కౌంటర్‌ పేరిట పోలీసులు కాల్చి చంపారని దీనిపై న్యాయ విచారణ చేపట్టాలని, ఘటనలో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పార్వతి రాజేశ్వర్‌, మండల అధ్యక్షుడు ఒడ్డెన్న, నాయకులు నసీర్‌, డి.రాజేశ్వర్‌, నరేంధర్‌, పుట్టి నాగన్న, పెద్దులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *