Breaking News

ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు

రెంజల్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్‌పై అసత్య ఆరోపణలు రాస్తూ ఒక పత్రిక సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తుందని ఇలాంటి అసత్య ఆరోపణలు రాస్తూ సోషల్‌ మీడియా వేదిక ద్వారా ప్రచారం చేస్తే సహించేది లేదని టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, బోధన్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌ అన్నారు.

గురువారం రెంజల్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే షకీల్‌ చేస్తున్న అభివద్ధిని చూసి ఓర్వలేని కొందరు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రియతమ ఎమ్మెల్యే షకీల్‌ మచ్చలేని నాయకుడని ప్రతినిత్యం ప్రజలకోసం అహర్నిశలు కషి చేసే ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలానే తప్పుడు రాతలు రాస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేరని ఎమ్మెల్యే నీతి నిజాయితి ఏంటో ప్రజలకు తెలుసు కనుకనే ఎమ్మెల్యేగా రెండవ సారి గెలిపించారని అన్నారు.

గతంలో కూడా ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసినవారే క్షమించండి అంటూ ప్రాధేయపడ్డారని గుర్తుచేశారు. మరోమారు ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూ ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి రాఘవేంధర్‌, సర్పంచ్‌లు రమేష్‌, బి.రాజు, లలిత, టిఆర్‌ఎస్‌ నాయకులు రఫిక్‌, సాయగౌడ్‌, కిషోర్‌, లోక గంగాధర్‌, షబ్బీర్‌, నారాయణ తదితరులు ఉన్నారు.

Check Also

నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆందోళన

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *