Breaking News

రోగులపట్ల ప్రేమ ఆప్యాయతతో మెలగాలి

రెంజల్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్య చికిత్సల కోసం వచ్చిన రోగులను పట్ల ప్రేమ ఆప్యాయత చూపించినప్పుడే రోగి యొక్క వ్యాధి సగం నయమవుతుందని ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌ అన్నారు. రెంజల్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆరోగ్య సలహా కమిటీ మొదటి సమావేశంలో ఆమె మాట్లాడుతూ. సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగుల పట్ల ప్రేమ ఆప్యాయత చూపించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ఏఎన్‌ఎంలు స్థానికంగా అందుబాటులో ఉండి ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వ్యాధులపట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ఏవైనా సమస్యలుంటే ఆరోగ్య సలహకమిటి దష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం వైద్యాధికారి క్రిస్టినా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎంపీపీ రజినీ కిషోర్‌, జడ్పీటీసీ సభ్యురాలు మేక విజయ సంతోష్‌, తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, వైఎస్‌ ఎంపీపీ యోగేష్‌, తాడ్‌ బిలోలి, దండిగుట్ట, కిసాన్‌ తండా, నీలా గ్రామ సర్పంచ్‌లు సునీత, శ్రీదేవి, జామున, లలిత లను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో హెచ్‌ఈవో వెంకటరమణ, సూపర్‌వైజర్‌ యేసులత, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆందోళన

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *