Breaking News

పుట్టిన బిడ్డకు ముర్రుపాలు అత్యంత క్షేమకరం

నిజామాబాద్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అప్పుడే పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు పట్టించటం ఎంతో శ్రేయస్కరమని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవద్ధుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి వెలిగించి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ మాట్లాడారు.

ప్రజల్లో కొన్ని అపోహలు,ఆధునిక పోకడల వల్ల పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు అందించలేకపోతున్నారని ఇది దురదష్టకరమన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలలోని పెద్దల సలహాల మేరకు తల్లులు పిల్లలకు ముర్రుపాలు ఇచ్చే వారని, ప్రస్తుతం 40 శాతం తల్లులు మాత్రమే ముర్రుపాలు అందిస్తున్నారని తెలిపారు. అవగాహన రాహిత్యం వల్లనే ప్రస్తుతం తల్లిపాల వారోత్సవాలను జరుపుకోవలసిన అగత్యం ఏర్పడిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.

తల్లిపాల విశిష్టతను వాటిలోని ఆరోగ్యకర విషయాలను యుక్తవయసులో ఉన్న ప్రతి ఒక్కరు, ముందు ముందు తల్లులు కావలసినవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరమన్నారు. ముర్రుపాలు అంటే వజ్రసమానమైన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, తొలి టీకాగా పనిచేస్తుందని వీటిలో యాంటీ ఇన్ఫెక్టివ్‌ ప్రాపర్టీస్‌ ఉంటాయని, నిమోనియా, శ్వాసకోశ వ్యాధులు, ఎలర్జీలు రాకుండా నిరోధిస్తాయని ఆయన తెలిపారు.

బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఆహారంగా అందించాలని, రెండు మూడు సంవత్సరాల వరకు కూడా బిడ్డలకు ఇతర పౌష్టిక ఆహారంతోపాటు తల్లిపాలు అందించాలని నిపుణులు తెలుపుతున్నపటికీ దానిని కొందరు ఆచరించడం లేదన్నారు. తల్లిపాలు పిల్లలకు ప్రకతి వరం లాంటిదని, తల్లిపాల వల్ల ఏర్పడే ఎన్నో ప్రయోజనాలను, విశిష్టతలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు.

ఈ దిశగా స్వచ్చంద సేవా సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖ వైద్య నిపుణులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరముందన్నారు. పాశ్చాత్య దేశాల కొన్ని పోకడల వల్ల మనకు కొన్ని అనర్థాలు ఏర్పడినప్పటికీ, ఆ దేశాల్లోని తల్లులు చట్ట సభలలో తమ పిల్లలకు తల్లిపాలు అందిస్తున్న విషయాలను మనం గమనిస్తున్నామని, ఇది మనం నేర్చుకోవాల్సిన, ఆహ్వానించదగ్గ విషయమన్నారు.

కార్యక్రమంలో పిల్లల వైద్యనిపుణులు డా.హరికష్ణ మాట్లాడుతూ, తల్లిపాలలోని పిల్లలకు సమతుల్యమైన ఆహారం లభిస్తుందని, తల్లి పాలల్లో లభించే మాంసకత్తులు డబ్బా పాలల్లో దొరకవని తల్లిపాల వల్ల పిల్లలు ఐక్యూ, మేధోశక్తి ఎక్కువగా ఉంటుందని, జీర్ణశక్తి బాగా ఉంటుందని, అందువల్ల తల్లిపాలే పిల్లలకు అత్యంత శ్రేయస్కరమని, తల్లులకు కూడా ఆరోగ్యకరమని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి స్రవంతి, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్‌ కవిత రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సిడిపివోలు, అంగన్వాడీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పరిశ్రమల అడ్డ లక్కంపల్లి సెజ్‌

ప్రారంభానికి సిద్దమవుతున్న మెగా ఫుడ్‌ పార్క్‌ నందిపేట్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *