Breaking News

మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వర్ధబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వేణురాజ్‌ మాట్లాడుతూ సుదర్శన్‌ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో బారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసి అనేక నీటి ప్రాజెక్టులతో పాటు జిల్లాలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజా నాయకుడిగా పేరుగాంచారని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజ్‌ని మంజూరు చేయించడంలో సుదర్శన్‌రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. అలాగే జిల్లా అభివద్ధిలో ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శులు రిషి, భాను, మెడికల్‌ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పరిశ్రమల అడ్డ లక్కంపల్లి సెజ్‌

ప్రారంభానికి సిద్దమవుతున్న మెగా ఫుడ్‌ పార్క్‌ నందిపేట్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *