నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ సరూర్ నగర్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్లను నిజామాబాద్‌లో ఆదివారం నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్‌లో బీసీ చైతన్యం చాలా ఉందని అన్నారు. నిజామాబాద్ బీసీల ...
Read More »Daily Archives: August 4, 2019
గురువుల ఆత్మీయ సమ్మేళనం
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రములోని టిజిపిఏ, స్వేరోస్ పేరెంట్స్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే గురుకుల గురువుల ఆత్మీయ సమ్మేళనానికి బయల్దేరి వెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్య బోధించినటువంటి మంచి గురువులకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని, సమ్మేళనం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమములో కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ ...
Read More »బీజేపీ గల్లీ గల్లీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ విస్తారక్ సప్తా సభ్యత్వ నమోదులో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఆదివారం విస్తతంగా 44, 45, 46 పట్టణ నూతన వార్డులల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడారు. అమిత్‌షా నేతత్వంలో బీజేపీ దేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన విస్తరించి ...
Read More »గ్రామ సమస్యలన్ని పరిష్కరిస్తా
నిజాంసాగర్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని వెల్గనూర్ గ్రామంలో సర్పంచ్, వార్డు మెంబరు కలిసి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కషి చేస్తానని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ హన్మంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.
Read More »ఎల్లారెడ్డి మినీ ట్యాంక్‌బండ్ పరిశీలన
నిజాంసాగర్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న పెద్ద చెరువు కట్ట ప్రమాదాలకు నిలయంగా మారింది. కానీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పెద్దచెరువు కట్టను వెడల్పు చెయ్యండి బాబు అని ప్రజలు మొర్రో అని మొత్తుకుంటే వెడల్పు చేయాల్సింది పోయి మినీ ట్యాంక్ బండ్ అని తెర పైకి తెచ్చారు టిఆర్ఎస్ నాయకులు. మినీ ట్యాంక్ బండ్ కాదు.. కదా చెరువు కట్టమీద ఉన్న గుంతలలో మట్టి పొసే దిక్కులేరు అన్ని ఆగ్రహం వ్యక్తం ...
Read More »జాక్రాన్పల్లి వాసికి దుబాయ్ లాటరీ
రూ. 29 కోట్లతో కోటీశ్వరుడిగా విలాస్ రిక్కల్ నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పని కోసం నానా అవస్థలు పడ్డాడు… భార్యా, ఇద్దరు కూతుళ్ళతో కుటుంబ జీవనం భారంగా మారింది… పొట్ట చేత పట్టుకొని కానరాని దేశాల వెంట పని కోసం పరుగులెత్తాడు…. ఫలితం శూన్యం… నిరాశ, నిస్పృహతో స్వదేశం వచ్చాడు… లక్ష్మిదేవి అనుగ్రహించింది… ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు… వివరాల్లోకి వెళితే… జక్రాన్‌పల్లికి చెందిన విలాస్ రిక్కల్కు దుబాయ్, అబుదాబిలో కోటి 50 లక్షల దరమ్ల లాటరీ టికెట్ వరించింది. ...
Read More »