Breaking News

ఓబీసీ మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఆగష్టు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్లను నిజామాబాద్‌లో ఆదివారం నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌లో బీసీ చైతన్యం చాలా ఉందని అన్నారు.

నిజామాబాద్‌ బీసీల సత్తాను ఈ నెల 7న హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌లో జరిగే ఓబిసి జాతీయ మహాసభలో చాటాల్సిన అవసరముందన్నారు. బీసీలు రాజ్యాంగం రాజ్యాధికారం వైపు అడుగు వేయాల్సిన తరుణం వచ్చిందని, దానిలో భాగంగానే మొదటి అడుగుగా అఖిల భారత ఓబిసి మహాసభ అని అన్నారు. బీసీలందరూ కూడా మేమెంతో మాకు అంత వాటా అనే నినాదం ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నా కాని పాలకులు పెడచెవిన పెడుతున్నందున, ఇక తమ సత్తా చాటాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అన్నట్టు రాజ్యాధికారమే అన్ని తాళాలకు తాళపు చెవి కాబట్టి రాజ్యాధికారం వైపు బీసీలు ప్రయాణించాల్సిన అవసరం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో బీసీలకు అరకొర కేటాయింపులను ఇక ముగించాలని అన్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ కుల బాంధవులు స్వచ్ఛందంగా బయలుదేరి సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 10 గంటలకు నిర్వహించు అఖిల భారత జాతీయ ఓబీసీ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆకుల ప్రసాద్‌, దర్శనం దేవేందర్‌, మాడవేడి వినోద్‌ కుమార్‌, కొయ్యాడ శంకర్‌, పొదిల శోభ, బొడిగం గంగాధర్‌, మేరు చంద్రకాంత్‌, గంగాధర్‌, సంజీవ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *