Breaking News

Daily Archives: August 5, 2019

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో ఆయా శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో 15వ ఆగస్టు వేడుకల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గత సంవత్సరం వేడుకల కంటే మిన్నగా నిర్వహించాలని, పట్టణం గ్రామాల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్లో లేవలింగ్‌ ...

Read More »

పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్ట వ్యతిరేకంగా పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్‌లో బక్రీద్‌ పండగ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోను ఆవులను వధించ కూడదని వధించిన పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ జంతు వధ నిరోధక చట్టం 1977 ప్రకారంగా శిక్షార్హులని చెప్పారు. బక్రీద్‌ పండుగ పశువులు ఖుర్బాని సందర్భంగా రోడ్లమీద ...

Read More »

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చిన దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన ఛాంబర్‌లో టీఎస్‌ ఐపాస్‌ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వారు తరువాత విరమించుకున్న పక్షంలో లిఖితపూర్వకంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 328 యూనిట్‌లకు గాను 623 దరఖాస్తులు రాగా అందులో 534 దరఖాస్తులను ఆమోదం ...

Read More »

ఫోన్‌ఇన్‌లో ఆరు ఫిర్యాదులు

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆరు ఫిర్యాదులు అందాయి. ప్రతినెల మొదటి సోమవారం భూ రికార్డుల సమస్యలపై ఫోన్‌ ఇన్‌ నిర్వహిస్తారు. వివిధ సమస్యలకు సంబంధించి ఆరు ఫిర్యాదులు, భూ రికార్డులకు సంబంధించి తొమ్మిది ఫిర్యాదులు అందినట్టు కలెక్టర్‌ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అదికారులను ఆయన ఆదేశించారు.

Read More »

ట్రీ గాడ్స్‌ పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ సంగీత్‌ కుమార్‌ బహుకరించిన పదివేల విలువగల 50 ట్రీ గాడ్‌లను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సదాశివనగర్‌ మండలం మల్లుపేట గ్రామసర్పంచ్‌ బాలకిషన్‌కు అందజేశారు. హరితహారంలో భాగంగా మొక్కల సంరక్షణ కోసం వాటిని వినియోగించాలని సూచించారు. హరితహారంలో భాగస్వాములైనందుకు జిల్లా కలెక్టర్‌ దాతను అభినందించారు. ఇదే స్ఫూర్తితో అందరు ముందుకు రావాలని కోరారు.

Read More »

ఆకుపచ్చని తెలంగాణగా తీర్చిదిద్దుదాం

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రాస్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణగా చేయడానికి శ్రీకారం చుట్టిందని, అందులో అందరు భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా సోమవారం ఆయన చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్‌ ఆవరణలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో ఎంపిడిఓ నాగేశ్వర్‌, ఎంపిపి నీలవ్వ, అనంతలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజావాణిలో 42 పిర్యాదులు

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 42 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. రెవెన్యూ-15, డిఏవో-3, ఎంసి-1, ఆర్‌అండ్‌బి-1, డిఆర్‌డివో-3, డిఎం అండ్‌ హెచ్‌వో-2, పశు సంవర్దకశాఖ-2, హోం-1, సివిల్‌ సప్లయ్‌-2, ఉపాధి కల్పన-5, ఎల్‌డిఎం-1, మత్స్యశాఖకు సంబంధించి ఒక్క ఫిర్యాదు అందాయన్నారు. వీటిని స్వీకరించిన జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ...

Read More »

లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ముందుకు పోవాలి

ఆర్మూర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ప్రాథమిక విద్య నుండి ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు దఢ సంకల్పం పెట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ పార్థసారథి అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో కీర్తిశేషులు చిట్ల ప్రమీల జీవన్‌ రాజు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణం జడ్పిహెచ్‌ఎస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ ...

Read More »

ఎమ్మెల్యే పరామర్శ

నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలంలోని నాగాధర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పెద్ద నాయకుని రాములు చాలా రోజులుగా అనారోగ్య అస్వస్థతతో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి సోమవారం వారిని కలిసి ఆరోగ్య పరిస్థితిని ఇంటికి వెళ్లి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల ఎంపీపీ గుర్రపు సుశీల – అంజయ్య ఉన్నారు.

Read More »

ఆర్టికల్‌370 రద్దును స్వాగతిస్తూ బీజేపీ నాయకుల సంబరాలు

రెంజల్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తూ రెంజల్‌ మండల బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. సోమవారం మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో బాణాసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. ఆనందోత్సాహాలతో సంబురాలు నిర్వహించారు. దేశం గర్వించదగ్గ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల సాహసోపేత నిర్ణయం వల్లనే ఆర్టికల్‌ 370 రద్దు సాధ్యమైందని బీజేపీ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌ అన్నారు. చరిత్రలోనే ...

Read More »

పలు శాఖలపై జిల్లా కలెక్టర్‌ సమీక్ష

వానలు కురుస్తున్నందున వ్యాదులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని సూచన నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో ప్రజావాణి సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున హరిత హారంలో ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపాలిటీ, వ్యవసాయ శాఖ, అటవి శాఖలకు ఎక్కువగా లక్ష్యానికి ...

Read More »

ఘనంగా నాగులచవితి వేడుకలు

రెంజల్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో నాగులపంచమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నాగులచవితి శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం రావడంతో శివాలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఉదయం నుంచి భక్తులు ఆలయాల వద్ద బారులు తీరి నాగేంద్రునికి పాలు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కలు తీర్చుకున్నారు.

Read More »

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అన్నారు. కల్హేర్‌ మండలంలోని మునిగే పల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో పట్టణాల్లో హరితహార కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, నాటిన మొక్కలను వాటి సంరక్షణ పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. మొక్కలు పెంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయని అన్నారు. మండల జడ్పీటీసీ నరసింహారెడ్డి, జిల్లా కో- ఆప్షన్‌ మెంబర్‌ ...

Read More »

శ్యామప్రసాద్‌ ముఖర్జీ కల నెరవేరిన రోజు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 370 ఆర్టికల్‌ రద్దు సందర్భంగా నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి పార్లమెంట్‌ ఆవరణలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో విధాన్‌, దో ప్రధాన్‌ నహి చలేగా అంటూ ఏకంగా తన ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి శ్యామప్రసాద్‌ ముఖర్జీ కల నేరవేరిన రోజుగా పేర్కొన్నారు. ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలు అర్పించి కాశ్మీర్‌ను కాపాడిన వారందరి ఆత్మలకు శాంతినిచ్చే రోజు అన్నారు. ఇది పండగ రోజు, ...

Read More »

7న పిఆర్‌టియు ధర్నా

నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయాలని మండల పిఆర్‌టియు అధ్యక్షుడు భాస్కర్‌ గౌడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఏంఆర్‌సి కార్యాలయం వద్ద పీఆర్‌టియు ధర్నా కరపత్రాలను, వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం భాస్కర్‌ గౌడ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని నియామకాలు జరగకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఈనెల 7వ తేదీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ...

Read More »

సర్పంచ్‌ చొరవతో రోడ్డు మరమ్మత్తు

నందిపేట్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు పూర్తిగా చెడిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా నందిపేట్‌ సర్పంచ్‌ సాంబారు వాని రోడ్డు భవన శాఖ అధికారులతో మాట్లాడి అంబేద్కర్‌ విగ్రహం వద్ద గల రోడ్డు మోకాలు లోతు గుంతలు కంకర మొరం వేయించి మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం అరటి పండ్లతో ఉన్న ఆటో గుంతలో పడి బోల్తా పడిన ...

Read More »

ఆవుపాల పంపిణీ

కామరెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నాగ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్‌ రోడ్‌ కాలనీలోని బిడిఎస్‌ఎస్‌ చౌరస్తా లో గెరిగంటి లక్ష్మినారాయణ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఆవుపాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా భారత్‌ రోడ్‌, చిన్న కాసబ్‌ గల్లీ, గడిరోడ్‌, స్టేషన్‌ రోడ్‌, పెద్ద బజార్‌, కమ్మరిగల్లి, బట్టుగల్లీ కాలనీ వాసులకు ఉచితంగా ఆవు పాల పంపిణీ చేశారు. అదేవిధంగా పంచముఖి హనుమాన్‌ కాలనీ యూత్‌ సభ్యులు చెలిమెల భాను ప్రసాద్‌, నేత, ...

Read More »

బిజెపి సంబరాలు

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసినందుకు గాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్‌ స్టాండ్‌ వద్ద బిజెపి శ్రేణులు బాణ సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కలలు కన్న ఒకే దేశం, ఒకే జండా, ఒకే రాజ్యాంగం అనే పిలుపును స్ఫూర్తిగా ...

Read More »