Breaking News

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో ఆయా శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో 15వ ఆగస్టు వేడుకల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గత సంవత్సరం వేడుకల కంటే మిన్నగా నిర్వహించాలని, పట్టణం గ్రామాల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్లో లేవలింగ్‌ కావాల్సిన టెంట్లు చైర్స్‌ ఏర్పాటు చేయాలని ఆయన ఆర్‌డిఓ, తహసిల్దార్‌లను ఆదేశించారు. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా సాంస్కతిక కార్యక్రమాలను చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ప్రథమ చికిత్స కేంద్రం 108 సర్వీసులను పోలీసు గ్రౌండ్‌ వద్ద ఏర్పాటు చేయాలని చెప్పారు. డిఆర్‌డివో హార్టికల్చర్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆరోగ్యశ్రీ ఫిషరీస్‌ అటవీశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్‌, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్‌మెంట్‌, వ్యవసాయ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇరిగేషన్‌ నెడ్‌ క్యాప్‌ శాఖలు స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు.

డిఆర్‌డివో ఎస్సీ కార్పొరేషన్‌ వికలాంగుల సంక్షేమ శాఖ మైనార్టీ ఎస్సీ, ఎస్‌టి శాఖలు ఎంపికైన లబ్ధిదారులకు రుణాలను పంపించేయాలని ఆదేశించారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్దేశించిన శాఖలు శకటాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ అంజయ్య, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, డిఆర్‌డివో రమేష్‌ రాథోడ్‌ ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Comment on the article