Breaking News

ఆర్టికల్‌370 రద్దును స్వాగతిస్తూ బీజేపీ నాయకుల సంబరాలు

రెంజల్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తూ రెంజల్‌ మండల బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. సోమవారం మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో బాణాసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. ఆనందోత్సాహాలతో సంబురాలు నిర్వహించారు.

దేశం గర్వించదగ్గ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల సాహసోపేత నిర్ణయం వల్లనే ఆర్టికల్‌ 370 రద్దు సాధ్యమైందని బీజేపీ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌ అన్నారు. చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో లిఖించబడిన రోజుగా ఈ రోజు ఉంటుందని ఈలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.

గత ప్రభుత్వాలు చేయని కషి భారతీయ జనతా పార్టీకే సాధ్యమని నిరూపించారని అది ప్రధాని మోదీ, అమిత్‌షాల కషియేనని అన్నారు. కార్యక్రమంలో చుక్క రాజు, పోచయ్య, ప్రకాష్‌, ఒడ్డెన్న, గోపాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *