Breaking News

బిజెపి సంబరాలు

కామారెడ్డి, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసినందుకు గాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్‌ స్టాండ్‌ వద్ద బిజెపి శ్రేణులు బాణ సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కలలు కన్న ఒకే దేశం, ఒకే జండా, ఒకే రాజ్యాంగం అనే పిలుపును స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్‌ 370 రద్దు చేయడం యావత్‌ భారత్‌ 130 కోట్ల ప్రజలకు ఆనంద దాయకమన్నారు.

మోదీ, షా ద్వయం పార్లమెంట్‌ సమావేశాలలో దేశానికి ఉపయోగపడే అనేక బిల్లులను ఆమోదింప చేశారని, అందులో ముఖ్యంగా త్రిబుల్‌ తలాక్‌, ఉగ్రవాదుల నిరోధక చట్టం, 370 ఆర్టీకల్‌ రద్దు వంటి కీలక చట్టాలు ఉన్నాయని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ఆర్ధికంగా, సామాజికంగా, అభివద్ధి చెందటమే కాక ఇతర దేశాలతో ఆయన చేసిన మిత్రుత్వం ఇప్పుడు ఉపయోగ పడుతుందని అన్నారు. కాశ్మీరీ పండిట్‌లు ఎలాంటి చింత లేకుండా తమ స్వస్థలాలకు పోవచ్చని వాళ్లకు పూర్తి రక్షణ బీజేపీ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

57 మందికి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ...

Comment on the article