Breaking News

ఆవుపాల పంపిణీ

కామరెడ్డి, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నాగ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్‌ రోడ్‌ కాలనీలోని బిడిఎస్‌ఎస్‌ చౌరస్తా లో గెరిగంటి లక్ష్మినారాయణ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఆవుపాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా భారత్‌ రోడ్‌, చిన్న కాసబ్‌ గల్లీ, గడిరోడ్‌, స్టేషన్‌ రోడ్‌, పెద్ద బజార్‌, కమ్మరిగల్లి, బట్టుగల్లీ కాలనీ వాసులకు ఉచితంగా ఆవు పాల పంపిణీ చేశారు.

అదేవిధంగా పంచముఖి హనుమాన్‌ కాలనీ యూత్‌ సభ్యులు చెలిమెల భాను ప్రసాద్‌, నేత, రంజిత్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, నిఖిల్‌ ఉచితంగా ఆవుపాలు పంపిణీ చేశారు.

Check Also

నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ధర్పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులు ...

Comment on the article