Breaking News

పలు శాఖలపై జిల్లా కలెక్టర్‌ సమీక్ష

వానలు కురుస్తున్నందున వ్యాదులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని సూచన

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో ప్రజావాణి సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున హరిత హారంలో ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముఖ్యంగా మున్సిపాలిటీ, వ్యవసాయ శాఖ, అటవి శాఖలకు ఎక్కువగా లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని అన్నారు. విద్యాశాఖ ఆగస్టు మాసంలో హాజరు మహోత్సవాలను నిర్వహిస్తున్నందున అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని, గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాలు సమావేశాల్లో ఈ అంశాన్ని దష్టిలో పెట్టుకుని ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు బాగా కురుస్తున్నందున చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న నందున వాటి క్యాచ్మెంట్‌ ఏరియాలో రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు అప్రమత్తంగా ఉండి ఏలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

వర్షాల కాలంలో ఎలాంటి అంటు వ్యాధులు విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామాల్లో, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఎస్సీ, బీసీ మైనార్టీ విద్యా సంస్థలలో, వసతి గహాల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేసి పరిసరాల పరిశుభ్రత పాటించాలని చెప్పారు. విద్యాశాఖ అధ్వర్యంలోని విద్యాసంస్థలలో శిథిలావస్థలో గల భవనాల్లో తరగతి గదులను నిర్వహించకూడదని, చిన్న చిన్న మరమ్మత్తులు చేసుకోవాలని వివిధ శాఖల విద్య సంస్థల్లో త్రాగునీరు లేదనే ఆరోపణలు పిర్యాదులు రాకూడదని చెప్పారు.

ప్రభుత్వ ఆస్తులు, భవనాలను పూర్తిగా వినియోగించుకోవాలని, పూర్తయిన భవనాలను సంబంధిత శాఖల బాధ్యులు అధీనం చేసుకొని వినియోగించుకోవాలన్నారు. ఈ విషయం ఇంతకు ముందు వ్యక్తిగతంగా చెప్పడం జరిగిందన్నారు. పూర్తయిన భవనాలను నిరుపయోగంగా మిస్‌యూజ్‌ చేయకూడదని చెప్పారు. ఆయా శాఖల జిల్లా బాధ్యులు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయ కేంద్రాన్ని వదిలి వెళ్లకూడదని చెప్పారు. ఆయా కార్యాలయాలలో జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు ఖాళీ పోస్టుల వివరాలను అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డిఅర్‌ఓ అంజయ్య, డిఅర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *