Breaking News

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చిన దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన ఛాంబర్‌లో టీఎస్‌ ఐపాస్‌ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వారు తరువాత విరమించుకున్న పక్షంలో లిఖితపూర్వకంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఇప్పటివరకు 328 యూనిట్‌లకు గాను 623 దరఖాస్తులు రాగా అందులో 534 దరఖాస్తులను ఆమోదం పొందినట్లు కలెక్టర్‌ ఈ సందర్భంగా చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా లబ్ధిపొందిన ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీని మంజూరు చేశారు. ఎస్సీ లబ్ధిదారునికి 3 లక్షల 25 వేల 500 రూపాయలు, 9 లక్షల 78 వేల రూపాయల సబ్సిడీని నలుగురు ఎస్‌టి లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ మంజూరు చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ శాంసన్‌, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ బాబురావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడి సరస్వతి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ శివలింగయ్య, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి

నందిపేట్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ ...

Comment on the article