Breaking News

లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ముందుకు పోవాలి

ఆర్మూర్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ప్రాథమిక విద్య నుండి ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు దఢ సంకల్పం పెట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ పార్థసారథి అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో కీర్తిశేషులు చిట్ల ప్రమీల జీవన్‌ రాజు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణం జడ్పిహెచ్‌ఎస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ ప్రాథమిక విద్య నుండే విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను ఎంచుకొని పట్టుదలతో ముందుకు పోయినప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు. ఎంత స్థాయికి ఎదిగినా కన్న తల్లిదండ్రులను, గ్రామాన్ని మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందజేయాలనే భావన కలిగినందున గత 2008 నుండి ఇప్పటివరకు పేద విద్యార్థులకు సాయం చేసి వారిని స్ఫూర్తిదాయకంగా ఎదిగేందుకు కషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల తమ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఏ విధంగా తమ గమ్యాన్ని చేరుకోవాలో ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు.

ఉపాధ్యాయుల కషి అంకిత భావం పట్టుదలతోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. మనిషిలో ఉన్న పరిపూర్ణతను వెలికితీయడమే విద్య, విద్యార్థులు విద్యతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని దానికి తోడు నైతిక విలువలు పెంపొందించుకొని సమాజంలో గుర్తింపు పొందాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలకనుగుణంగా ముందుకు పోవాలన్నారు.

తల్లిదండ్రుల ప్రేమసహకారం, ఆశీర్వాదం తప్పనిసరిగా పొందవలసిన అవసరముందన్నారు. ప్రతి ఒక్కరు విద్యా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, విజ్ఞానానికి పరమార్థం మానవ సేవయే అని చెప్పారు. ఉన్న ఊరుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎల్లప్పుడు గుర్తు చేసుకోవాలని చెప్పారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశం సమాజం బాగుపడాలంటే నేటి విద్యార్థులే వెన్నెముక లాంటి వారని పోటీతత్వాన్ని పెంపొందించుకొని విద్యా స్పూర్తికి తోడ్పాటు అందించాలని చెప్పారు.

ఈ వేడుకలను చూస్తుంటే తాను కూడా చదువుకున్న పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి, జెసి చిట్ల ప్రమీల జీవన్‌ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు పురస్కారం అందజేయడం గొప్ప విషయమని, ఇది ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ శ్రీనివాస్‌, ఏసిపి రాములు, ఎంఈఓ, జడ్పీ హైస్కూల్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *