Breaking News

7న పిఆర్‌టియు ధర్నా

నిజాంసాగర్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయాలని మండల పిఆర్‌టియు అధ్యక్షుడు భాస్కర్‌ గౌడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఏంఆర్‌సి కార్యాలయం వద్ద పీఆర్‌టియు ధర్నా కరపత్రాలను, వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం భాస్కర్‌ గౌడ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని నియామకాలు జరగకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.

ఈనెల 7వ తేదీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంతోష్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, జిల్లా బాధ్యులు సురేందర్‌, శ్రీధర్‌ జోషి, వెంకటరమణ, మండల శాఖ బాధ్యులు జనార్ధన్‌, సాయినాథ్‌, రాజు, అజయ్‌ కుమార్‌, వెంకటేశం, భూమయ్య తదితరులు ఉన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *