సర్పంచ్‌ చొరవతో రోడ్డు మరమ్మత్తు

నందిపేట్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు పూర్తిగా చెడిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా నందిపేట్‌ సర్పంచ్‌ సాంబారు వాని రోడ్డు భవన శాఖ అధికారులతో మాట్లాడి అంబేద్కర్‌ విగ్రహం వద్ద గల రోడ్డు మోకాలు లోతు గుంతలు కంకర మొరం వేయించి మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు.

దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం అరటి పండ్లతో ఉన్న ఆటో గుంతలో పడి బోల్తా పడిన విషయం తెలుసుకొని వెంటనే రోడ్డు భవన శాఖ అధికారులతో సమస్య తీవ్రత గూర్చి వివరించడంతో స్పందించిన అధికారులు వెను వెంటనే యుద్ధ ప్రాతిపదికన రెండు గంటల వ్యవధిలోనే పనులు ప్రారంభించడం విశేషం. వార్డ్‌ సభ్యుడు ఎస్‌.జి.తిరుపతి, ఎంపిటిసి పెంటర్‌ రాజు దగ్గర వుండి రోడ్డు పనులు పర్యవేక్షించారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *