Breaking News

శ్యామప్రసాద్‌ ముఖర్జీ కల నెరవేరిన రోజు

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 370 ఆర్టికల్‌ రద్దు సందర్భంగా నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి పార్లమెంట్‌ ఆవరణలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో విధాన్‌, దో ప్రధాన్‌ నహి చలేగా అంటూ ఏకంగా తన ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి శ్యామప్రసాద్‌ ముఖర్జీ కల నేరవేరిన రోజుగా పేర్కొన్నారు. ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలు అర్పించి కాశ్మీర్‌ను కాపాడిన వారందరి ఆత్మలకు శాంతినిచ్చే రోజు అన్నారు.

ఇది పండగ రోజు, ప్రతీ భారతీయడు గర్వంగా తల ఎత్తుకుని చాటుకొనే రోజని ఎంపి చెప్పారు. కశ్మీరం నాదని చాటుకొనే రోజు ఇదని, కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సంబరాలు జరుపుకునే రోజు ఇదని అన్నారు. భరతమాత వీరపుత్రులు మోడీ, అమిత్‌ షా సారధ్యానికి మాత్రమే ఇది సాధ్యమని అర్వింద్‌ ప్రశంసించారు. కాశ్మీర్‌ ఈ దేశంలోనే లేదన్న తెరాస నాయకురాలికి, వోట్‌ బ్యాంక్‌ రాజకీయాలు చేసే మజ్లీస్‌కు ఈ నిర్ణయం చెంపపెట్టు లాంటిదని అన్నారు.

కాంగ్రెస్‌ వాళ్లు నెహ్రూని మోడ్రన్‌ ఇండియా ఆర్కిటెక్చర్‌ అంటారని, కాశ్మీర్‌ను అల్లకల్లోలం చేసి చేతకాక పిఓకె ఏర్పాటు చేసి, బాంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ను విడదీయడాన్నీ ఆర్కిటెక్చర్‌ అనరని కార్పెంటరీ అంటారని స్పష్టం చేశారు. అఖండ భారత నిర్మాణంలో భరతమాత కుడి, ఎడమ భుజాలుగా నిలబడుతోన్న మోడీ, అమిత్‌షా ద్వయానికి దేశం మద్దతుగా నిలవాలని కోరుతున్నానని అర్వింద్‌ ధర్మపురి పిలుపునిచ్చారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *