Breaking News

కందకుర్తి చెక్‌ పోస్ట్‌ తనిఖీచేసిన సీపీ

రెంజల్‌, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ పండుగ దృష్ట్యా ఉంచి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గల చెక్‌ పోస్టులలో భాగంగా మండలంలోని కందకుర్తి వద్ద గల చెక్‌ పోస్ట్‌ను మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ తనిఖీచేశారు. చెక్‌ పోస్టు గుండా అక్రమ రవాణా జరుగకుండా దష్టి పెట్టాలని చెక్‌ పోస్ట్‌ అధికారులకు ఆదేశించారు.

ఈ మధ్యలో అంతర్రాష్ట్ర ముఠాలు జిల్లాలో ప్రవేశించినట్లు మూమెంట్స్‌ కనిపించిందని వీటిని అరికట్టేందుకు కూడా చెక్‌ పోస్టు పనిచేస్తుందని అన్నారు. అనంతరం చెక్‌ పోస్ట్‌లో గల రిజిస్టర్‌లను పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అవకతవకలు జరిగినట్లు తేలితే ఎట్టివారినైన సహించేది లేదన్నారు. ఆయన వెంట బోధన్‌ ఏసీపీ రఘు, ఎస్సై శంకర్‌ సిబ్బంది ఉన్నారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *