Breaking News

తెలంగాణ దార్శనికుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌

రెంజల్‌, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ దార్శనికుడు, సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ ఆదర్శ ప్రాయుడని మండలప్రజాపరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజినీ కిషోర్‌ కొనియాడారు. మంగళవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో జయశంకర్‌ సార్‌ 86వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దశ దిశను నిర్దేశించిన దార్శనికుడని ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కషి చేసి ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినవారమవుతామన్నారు.

కార్యక్రమంలో ఎంపిడివో శ్రీనివాస్‌, పంచాయతీ రాజ్‌ ఏఈ లిఖిత, ఎంఈవో గణేష్‌ రావ్‌, సర్పంచ్‌ రమేష్‌, ఏపీవో సునీత, టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, మాజీ ఎంపీటీసీ కిషోర్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు రఫిక్‌, సిబ్బంది సురేష్‌, బీరేందర్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆందోళన

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *