Breaking News

పల్లెల్లో హరితహారం

నిజామాబాద్‌, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం ముషీర్‌ నగర్‌ గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐ ప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు.

ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని అన్నారు. అదేవిధంగా వర్షాకాలం అయిన తర్వాత వాటికి నీరుపోసి సంరక్షించాలని పేర్కొన్నారు. అలాగే వర్షాలు సమద్ధిగా కురవాలంటే అడవులు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు. ప్రజలు ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉన్న చోట మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *