Breaking News

మీ-సేవా అర్జిదారులకు 9న ఇంటర్వ్యూలు

కామారెడ్డి, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజన్‌లో మీ సేవా కేంద్రాల కోసం అర్జి చేసుకున్న వారందరికి ఈనెల 9న ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహించనున్నట్టు కామారెడ్డి ఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. మీసేవా కేంద్రాల కోసం అర్జి చేసుకున్న అభ్యర్థులు వారి పేర్లను ఆర్డీవో, తహసీల్‌ కార్యాలయాల్లో ప్రదర్శించిన జాబితాలో చూసుకొని పరీక్షలకు హాజరుకావాలని వివరించారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *