Breaking News

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాచారెడ్డి మండలంలోని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కాటిపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన, ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి ప్రజలకు చేరువయ్యేలా నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

తెలంగాణాలో బీజేపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని, నియంతత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుందని అందుకే సభ్యత్వ నమోదులో దూసుకుపోతోందని అన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Check Also

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *