Breaking News

సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన

రెంజల్‌, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని నిజామాబాద్‌ వ్యవసాయ అధికారి రవీందర్‌ అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి, బొర్గం గ్రామాలలో శుక్రవారం రైతులకు రెంజల్‌ వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ రావ్‌ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అధిక లాభాలు పొందవచ్చని, రైతులు రసాయన ఎరువులు వాడడం మానేసి పూర్తిగా సేంద్రియ పద్దతుల్లోనే పంటను సాగుచేయాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయసమితి గ్రామ అధ్యక్షుడు దత్తుపటేల్‌, జిల్లా సభ్యుడు మౌలానా, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, టిఆర్‌ఎస్‌ నాయకులు మస్కుర్‌ ప్రవీణ్‌, నారాయణ రెడ్డి, ఏఈఓ అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆందోళన

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *