Breaking News

భక్తి శ్రద్దలతో బక్రీద్‌

కామారెడ్డి, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సోమవారం బక్రీద్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు మాజీ మంత్రి మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌కి జిల్లా నాయకులు ఈద్‌ ముబారక్‌ తెలియజేశారు. హిందూ ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా మహ్మద్‌ అలీ షబ్బీర్‌ మాట్లాడుతూ తమకు కలిగినంతలో కొంత భాగాన్ని బీదలకు, బంధుమిత్రులకు దాన ధర్మాలను చేయాలని అందరూ ఇదే విధంగా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలని కోరారు.

కార్యక్రమంలో డిసిసి జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు, వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఫిరంగి రాజేశ్వర్‌, కారంగుల అశోక్‌ రెడ్డి, చాట్ల రాజేశ్వర్‌ పండ రాజు, గోనె శీను, కౌన్సిలర్‌ అంజద్‌, జమీల్‌, గడిల నరసింహులు, ప్రసాద్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article