Breaking News

కల్లుగీత వత్తిని రక్షించాలనీ కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ

కామారెడ్డి, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారేడ్డిలొ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సైదగౌని వెంకట్‌ గౌడ్‌, దెవునుపల్లి గౌడ సంఘం అధ్వర్యంలో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా వెంకట్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన అనంతరం కల్లుగీత వత్తికి మంచి రోజులు వస్తాయనీ అనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత వత్తిని నాశనము చేయాలని చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కల్లుగీత వత్తిని రక్షిస్తే ఐదు లక్షల కుటుంబాలకు జీవనాధారం చూపించవచ్చనీ, కల్లు..గూడలు అనీ ఎన్నికలలో హామి ఇచ్చి మరిచిపొయారనీ అన్నారు. కావున ఇప్పటికైన ముఖ్యమంత్రి కల్లుగీత వత్తిని రక్షించాలనీ కోరుతూ సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించాలనీ అన్నారు. కల్లుగీత వత్తికి సమగ్రమైన చట్టం చేయాలని, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాపిత పిలుపులొ భాగంగా సోమవారం కామారేడ్డిలొ పోస్టాఫీసు వద్ద లేఖలు రాసి డబ్బాలో వేశారు.

కార్యక్రమంలొ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సైదగౌని వెంకట్‌ గౌడ్‌తో పాటు దెవునుపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు చెర్ల సాయాగౌడ్‌, వర్కింగ్‌ ప్రసిడేంట్‌ దొడ్ల నారాగౌడ్‌, కార్యదర్శి భస్వగౌడ్‌, నాయకులు రాజ్‌ గౌడ్‌, గంగాగౌడ్‌, రవిందర్‌ గౌడ్‌, క్రిష్ణ గౌడ్‌, రాము గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

25న ఆదిభట్ల నారాయణదాసు జయంతి

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *