Breaking News

కశ్మీర్‌ ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి

కామారెడ్డి, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ మంత్రి, శాసన మండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ బక్రీద్‌ పండుగ సందర్భంగా సోమవారం ఈద్గా వద్ద ప్రసంగించారు. దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తు హరియానా ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఈద్గాలో తీర్మానించారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఓ నూతన శకం ప్రారంభమైందని కాశ్మీరి నా బిడ్డలకు ఇక నుండి న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారని, ఆర్టికల్‌ 370 రద్దు వల్ల కశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతవాసులు తీవ్రంగా నష్టపోయారని, వారికి న్యాయం చేస్తామని ఆర్టికల్‌ 370 వల్ల జమ్మూకశ్మీర్‌కి మేలు జరుగుతుందనే విషయాన్ని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారని చెబుతూ తాము తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం ఉందని మోదీ అన్నారు.

కానీ మోడీ మంత్రివర్గంలో ఉన్నమంత్రులు, హర్యానా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగిన మహర్షి భాగీరత్‌ జయంతి సమరోహ్‌ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖత్తర్‌ కాశ్మీరీ బాలికలపై అవమానకరంగా వ్యాఖ్యానించారన్నారు. రాష్ట్రంలో లింగ నిష్పత్తి సమతుల్యతపై మాట్లాడుతూ మనోహర్‌ లాల్‌ ఖత్తర్‌ మాట్లాడుతూ 1,000 మంది అబ్బాయిలకు బాలికల నిష్పత్తి 850 ఉందన్నారు.

అయితే అది సరిపోదు, లింగ నిష్పత్తి ఇంకా లేనందున కాశ్మీర్లో ఆర్టికల్‌ 370, 35 (ఎ) రద్దు చేయడం జరిగింది, కాబట్టి కాశ్మీర్‌ యువతులు చాలా అందంగా ఉంటారని ఇంకా పత్రికల్లో రాయ రాని విధంగా వ్యాఖ్యానించారన్నారు. ఇకనుండి కాశ్మీరి యువతులను ఇక్కడికి తీసుకువచ్చి వివాహాలు జరిపిస్తామని కాశ్మీరీ యువతుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దుచేసి ఇదేనా కాశ్మీరీలకు చేసే న్యాయం అని మహ్మద్‌ అలీ షబ్బీర్‌ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిపై తన మంత్రులపై చర్యలు తీసుకొని కాశ్మీర్‌ ప్రజల్లో ధైర్యాన్ని ఆత్మ స్థైర్యాన్ని నింపాలని, శాంతిని కాపాడాలని కోరారు.

Check Also

25న ఆదిభట్ల నారాయణదాసు జయంతి

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *