రెంజల్, ఆగష్టు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని సాటాపూర్ గ్రామంలోని ఉపాధి హామీ నర్సరీని మంగళవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు. నర్సరీలోని ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని ఫీల్డ్ అసిస్టెంట్‌కు సూచించారు.
ప్రతి మొక్కను కాపాడుకునే బాధ్యత తమ పైనే ఉందని, ఎప్పటికప్పుడు నర్సరీలను పరిశీలించి మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఆయన వెంట ఈసి శరత్ చంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్ ఉన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే మహిళలకు రక్షణ లేదు - December 10, 2019
- స్త్రీ నిధి రుణాలు సక్రమంగా మంజూరయ్యేలా చూడాలి - December 10, 2019
- భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి - December 10, 2019