Breaking News

పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబానికి న్యాయం చేయాలి

రెంజల్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్నేళ్లుగా వీరన్నగుట్ట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న బుచ్చమ్మను పనుల నుంచి తొలగించారనే ఆవేదనతో మతి చెందిందని, కార్మికురాలి కుటుంబానికి న్యాయం చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం వీరన్నగుట్ట గ్రామ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మతురాలి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ధర్నా విరమించేది లేదని వామపక్షాలు పట్టుపట్టారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు మతురాలి కుటుంబ సభ్యులు, వామపక్ష సభ్యులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. సర్పంచ్‌ను అరెస్ట్‌ చేసి మతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని పట్టుబట్టడంతో రుద్రూర్‌ సిఐ దామోదర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో చర్చించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Check Also

మహిళా సమాఖ్య నూతన పాలకవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఆర్మూర్‌ మండల మహిళా సమాఖ్య 12వ వార్షిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *